సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం కావాలి

- మాజీ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వరరావు కుమారుడు కోడేరు వైస్ ఎంపీపీ కొత్త శ్రీనివాసరావు
ముద్ర. కొల్లాపూర్:-రాష్ర్టంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం కావాలని మాజీ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వరరావు కుమారుడు కోడేరు వైస్ ఎంపీపీ కొత్త శ్రీనివాసరావు అన్నారు.కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల వైస్ ఎంపీపీ కొత్త శ్రీనివాసరావు సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అలాంటి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం కావాలని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కేసిఆర్ బలపరిచిన కొల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి ని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు బిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తానని.. బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని శ్రీనివాసరావు అన్నారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు.