ఢిల్లీ బాసులు ఎందుకు దండగ-పేద వాడి కష్టంచూసే కెసిఆర్ ఉండగా

ఢిల్లీ బాసులు ఎందుకు దండగ-పేద వాడి కష్టంచూసే కెసిఆర్ ఉండగా
  • డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత, చిన్నంబావి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు  ధారసింగ్

ముద్ర.వీపనగండ్ల:-రాష్ట్రంలో పేద వాడి కష్టంచూసే కెసిఆర్ ఉండగా,కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాసులు ఎందుకు దండగ అని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత, చిన్నంబావి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు బి ధారసింగ్ అన్నారు.చిన్నంబావి మండల బెక్కెం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.400 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, సౌభాగ్య లక్ష్మి పేరుతో పేద మహిళలకు నెలకు 3000 రూపాయలు, రైతుబంధు ఎకరానికి 16,000, విడతల వారీగా ఆసరా పింఛన్ 5016 రూపాయలు పెంపు, అగ్రవర్ణ పేదలకు గురుకుల పాఠశాలలు, ప్రతి కుటుంబానికి కెసిఆర్ బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు ప్రీమియం, ఆరోగ్యశ్రీ బీమా కింద 15 లక్షలు, స్వశక్తి మహిళా గ్రూపులకు సొంత భవనాలు వంటి పథకాలను బిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తుందని ప్రజలకు వివరించి హర్షవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలోమండల యూత్ మాజీ అధ్యక్షులు కిరణ్ కుమార్, సీనియర్ బి ఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తిని కృష్ణరెడ్డి,ఇరిటం బిచ్చన్న,కృష్ణయ్య,వెంకటయ్య,వెంకట స్వామి, కొత్త హారికంత్. శివ సాగర్,ఇరిటం రాజు, జుర్రు గోవింద్,శివుడు. మురళి,మద్దిలేటి.శాంగపూర్* వెంకటేష్. తది తరులు పాల్గొన్నారు.