ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

మహదేవపూర్, ముద్ర: మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణిబాయి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి నినాదాలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష నెరవేరిందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ  యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విలాస్ రావు, యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు కట్కం అశోక్, మైనారిటీ బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు అస్రార్ ఖురేషి, మెనారిటీ అధ్యక్షులు ఎజాజ్, ప్రధాన కార్యదర్శి ఇర్షాద్, సలావుద్దిన్, టౌన్ ప్రెసిడెంట్ నయూం, మండల ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, చేకుర్తి శంకర్, యుత్ నాయకులు, సీనియర్లు పాల్గొన్నారు.