తెలంగాణ వీర వ‌నిత చాక‌లి ఐల‌మ్మ : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

తెలంగాణ వీర వ‌నిత చాక‌లి ఐల‌మ్మ : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

రేగొండ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

ముద్ర న్యూస్ రేగొండ: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి అయిన చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి  అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా  రేగొండ లో నిర్వహించిన ఐలమ్మ  వర్దన్తి వేడుకలో ముఖ్య అతిథులుగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే  గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా భూపాలపల్లి శాసనసభ్యులు  గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంరగిల్చిన అగ్నికనం ఐలమ్మ అని అన్నారు. భూమికోసం,భుక్తికోసం దోపిడీపీడనవిముక్తి కోసం జరిగిన ఆనాటిసాయుధ రైతాంగ పోరాటంలో దొరలను గడగడలాడించిన వీరవనిత చాకలి ఐలమ్మ ,చాకలి ఐలమ్మ జీవితచరిత్ర స్ఫూర్తిదాయకం.
చాకలి ఐలమ్మ గారి పోరాట పటిమను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  తెరాసా మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, ఎంపీటీసీ మైసా సుమలత బిక్షపతి, గండ్ర యువసేన నాయకులు గంజి రజనీకాంత్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు వారణాసి అజయ్, యూత్ నాయకులు తాళ్లపల్లి చింటూ గౌడ్, ఎంపీటీసీ కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి, తదితరు నాయకులు పాల్గొన్నారు...