పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన యోధురాలు చాకలి ఐలమ్మ : జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన యోధురాలు చాకలి ఐలమ్మ : జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సాయిధ పోరాట యోధురాలు  వీరనారి  చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వీరనారి చాకలి ఐలమ్మ  వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి ఐలమ్మ చూపిన తెగువ,  ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్,  వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు ఏశాల అశోక్,  కడారి వెంకటేష్,  పద్మ పాల్గొన్నారు.