బోనాల పండుగ చెక్కులను పండుగకు ముందే దేవాలయ కమిటీలకు అందించాలి - కార్పొరేటర్  ఏనుగు పావని

బోనాల పండుగ చెక్కులను పండుగకు ముందే దేవాలయ కమిటీలకు అందించాలి - కార్పొరేటర్  ఏనుగు పావని

 
ముద్ర, ముషీరాబాద్:తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే అషాడమాసం అమ్మవారి బోనాల జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఏనుగు పావని కోరారు. పండుగ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రతి ఏడాది అన్ని దేవాలయాల కమిటీలకు అందించే చెక్కులను ఈసారి పండుగకు ముందే  అందించాలని కోరుతూ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్  రామకృష్ణను గురువారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్, బిజెపి నగర నాయకులు ఏనుగు వినయ్ కుమార్ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ  కమిషనర్ తో బోనాల పండుగ నిధుల మంజూరు పై చర్చించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎక్కువ శాతం దేవాలయాలకు పండుగ తరువాత చెక్కులు అందుతున్నాయని, అలా కాకుండా ఈ సారి జాతర అవసరాల నిమిత్తం దేవాలయాల కమిటీలకు  ఉందుగానే చెక్కులను అందచేయాలని సూచించారు. అలాగే ఎంతో ఘనంగా జరుపుకునే బోనాల పండుగకు సరిపడేలా నిధులను పెంచాలన్నారు. హిందువుల మనోభావాలను దృష్టి లో పెట్టుకొని, ఇతర మతాల పండుగలకు ఎలాగైతే ముందస్తుగా, సరిపడే నిధులను మంజూరు చేస్తున్నారో అదే విధంగా దేవాలయాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.