ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం

ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం

భువనగిరి జూలై 9 (ముద్ర న్యూస్):- భువనగిరి ఏబీవీపీ ఆధ్వర్యంలో 75 వ జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా స్వామీ వివేకానంద విగ్రహనికి పూల మాల వేసి  జెండా ఆవిష్కరించారు,  ఈ కార్యక్రమంలో  యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ బోడ బుచ్చిబాబు పాల్గొని  మాట్లాడుతూ జాతీయ పునర్నిర్మాణంలో ఏబీవీపీ  కీలక పాత్ర పోషిస్తుందని, దేశంలో అతి పెద్ద విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని, విద్రోహశక్తులను తరిమికొట్టే దిశగా ఏబీవీపీ పనిచేస్తుందని, విద్యార్థులందరూ పెద్ద ఎత్తున దేశం కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ విభాగ్ ఎస్ఎస్ డి, కన్వీనర్ సామల సాయి, మణికంఠ, అక్షయ్, కార్తీక్, సంజన, సాయి కుమార్, సాయి తేజ, విశాల్ రెడ్డి, తదితర కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.