రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలి:కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలి:కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

భువనగిరి ఆగస్టు 04 (ముద్ర న్యూస్):- జిల్లాలో రెడ్ క్రాస్ కార్యక్రమాలను విస్తృతపరచాలని యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ప్రతినిధి బృందం కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో తను పాల్గొంటానని, కార్యక్రమాలు చేసినప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని తెలిపారు, అట్టడుగు గ్రామీణ పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు అందే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీ నరసింహారెడ్డి, రాష్ట్ర ఈసీ మెంబర్ మహేందర్ రెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, జిల్లా డైరెక్టర్లు శేక్.హమీద్ పాశ, కే ప్రభాకర్ రెడ్డి, రాంబాయమ్మ,ఎస్.ఎన్.  చారి,రాజిరెడ్డి, మోత్కూరు మండల  కార్యదర్శి మెట్టుమంగేష్ ,ఉపాధ్యక్షుడు ముప్ప వెంకట్రెడ్డి ,ఆత్మకూరు మండల అధ్యక్షుడు పి పూర్ణచందర్ రాజు, జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు బీసుమచ్చగిరి, శివ తదితరులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.