భువనగిరిని ప్రత్యేక ఐటీ హబ్ గా చేస్తాం..

భువనగిరిని ప్రత్యేక ఐటీ హబ్ గా చేస్తాం..
  • పారిశ్రామిక పార్కు ను ఏర్పాటు చేసి స్థానిక యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం..
  • శేఖర్ రెడ్డి 50వేల మెజారిటీ తో గెలవబోతున్నారు..
  • తెలంగాణ లో భూముల ధరలు పెరిగాయి..
  • ఎన్నికల తరువాత బస్వాపురం ప్రాజెక్టు ను ప్రారంభించటానికి వస్తాను...
  • అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం..
  • ధరణి పోర్టల్ నీ మూడు నెలలు కష్టపడి తయారు చేశాం..
  • కాంగ్రెస్ వారు ధరణి ని  రద్దు చేస్తాం అంటున్నారు... 
  • భూములు లాక్కున్నే పరిస్థితి వస్తుంది...
  • ఆలోచించి ప్రజలు ఓటు వేయండి...
  • భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరిని ప్రత్యేక ఐటీ హబ్ గా చేస్తామని, పారిశ్రామిక పార్కు ను ఏర్పాటు చేసి స్థానిక యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ భువనగిరి  నియోజకవర్గ హామీ ఇచ్చారు. సోమవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి కి ఓటు వేసి భారీ మెజార్టీతో మూడవసారి గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని  అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని చెప్పారు. ఎన్నికల తరువాత బస్వాపురం ప్రాజెక్టు ను ప్రారంభించటానికి వస్తానని అన్నారు. కరువుతో ఉన్న భువనగిరి లో ఇవ్వాళ అద్భుతమైన పంటలు పండిస్తున్నారని ఈ జిల్లా కు యాదాద్రి  భువనగిరి అని లక్ష్మీ నరసింహస్వామి పేరు పెట్టుకున్నామని ప్రత్యేక జిల్లా గా ఏర్పాటైన జిల్లా అద్భుతంగా అభివృద్ధి జరిగిందన్నారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అద్భుతమైన అభివృద్ధి చేశారని మళ్ళీ గెల్చేది శేఖర్ రెడ్డినే.. ఇక్కడ  కాళేశ్వరం  ప్రాజెక్టు లో  అంతర్భాగంగా నిర్మిస్తున్న  బస్వపూర్ రిజర్వాయర్ ద్వారా త్వరలోనే నీళ్లు అందిస్తామన్నారు. ధరణితో  రైతుల కష్టాలు పోయాయి, అన్నదాతలు సంతోషంగా వ్యవసాయము చేసుకుంటున్నారని కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తాం అంటున్నారని ధరణి పోతే మళ్ళీ అన్నదాతలు కొట్లాటలు వస్తాయి జోష్యం చెప్పారు.

అవినీతి వస్తది, ఫైరవి కారుల కాంగ్రెస్ పార్టీని రానివ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తో పెద్ద ప్రమాదం పొంచి  ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ వస్తే  కరంట్ మాయం అవుతుందని అప్రమత్తంగా ఉంటూ 3 గంటలు కరంట్  ఇస్తాం అంటున్న కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలన్నారు. నా కున్న సర్వే ప్రకారం 50 వేల మెజార్టీతో భువనగిరి లో గెలుస్తున్నాం అన్నారు. పొన్నాల పొన్నాల లక్ష్మయ్య  కాంగ్రెస్తో విసిగి వేసారి తెలంగాణ అభివృద్ధి కోసం బిఆర్ఎస్  లోకి వచ్చారని బిఆర్ఎస్ ని మళ్ళీ గెలిపించాలని, పార్టీకి కులం, మతం అనే తార తమ్య భేదాలు లేవని అందరి బాగు కోసం మ్యానిఫెస్టో విడుదల చేశామని చెప్పారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో  తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని  యాదాద్రి లో భూముల రేట్లు అమాంతం పెరిగాయన్నారు. అందరికి సన్న బియ్యం అందిస్తామన్నారు. అన్నదాతలకు 24 గంటల కరంట్ వుండాలంటే టిఆర్ఎస్ ను మాత్రమే గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకంట జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, దూదిమెట్ల  బాలరాజు యాదవ్,  నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గొంగిడి మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, బిక్షమయ్య గౌడ్, గ్రంధాల సంస్థ జిల్లా చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, రైతు సమన్వయ సంత జిల్లా చైర్మన్ కొలుపుల అమరేందర్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నపోయిన ఆంజనేయులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, ఎంపీపీ రాసాల నిర్మల, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, భువనగిరి కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు  పాల్గొన్నారు.

అలరించిన గాయని మధుప్రియ  పాటలు..

 సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో  గాయని మధుప్రియ  పాడిన పాటలు సభకు వచ్చిన ప్రజలను ఎంతో అలరించాయి.