భూదాన్ పోచంపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

ముద్ర భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాలలో భువనగిరి ఎమ్మెల్యే పైన శేఖర్ రెడ్డి సోమవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని పెద్దగూడెం గ్రామంలో గ్రామపంచాయతీ భవనానికి, గౌడ సంఘం భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. జుబ్లక్ పల్లి గ్రామం,వంక మామిడి గ్రామాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్ర సబ్ సెంటర్ నూతన భవన నిర్మాణాలకు, ధర్మారెడ్డి పల్లి గ్రామంలో గౌడ సంఘ భావన నిర్మాణాలకు శంఖుస్థాపన చేసి కాంట్రాక్టర్లకు అధికారులకు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.