ప్రమాదకరం గా మారిన పెద్ద బోనాల - చిన్న బోనాల రోడ్

ప్రమాదకరం గా మారిన పెద్ద బోనాల - చిన్న బోనాల రోడ్

ముద్ర సిరిసిల్ల టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా లో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు చిన్న బోనాల చెరువు కట్ట తెగి సిరిసిల్ల లో వరదల కారణంగా పంట పొలాలతో పాటు ఎన్నో రోడ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రవాహంతో పెద్ద బోనాల నుండి చిన్న బోనాల వెళ్ళే సిసి రోడ్ కోతకు గురి అవడంతో ప్రమాదకరం గా మారింది. పెద్ద ట్రక్ వాహనాలు ఈ రోడ్ వెంట వెళితే రోడ్ కుంగి పోయే అవకాశం ఉందని, అలాగే ప్రజలు, వాహనాలు రాత్రి సమయం లో ఈ రోడ్ వెంట వెళ్ళినపుడు పక్కనే ఉన్న గుంత లో పడే అవకాశం ఉందని బోనాల గ్రామస్థులు తెలిపారు. అధికారులు తక్షణమే రోడ్ మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరారు.