ప్రజల కోసమే జీవితం - మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జోతక్క..

ప్రజల కోసమే జీవితం - మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జోతక్క..
  • రాజకీయంలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగిన కుటుంబం..
  • కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ సేవ చేస్తాం .
  • ఎన్నికల్లో కరమ్ చంద్ పోటీ చేస్తాడు..

మెట్‌పల్లి ముద్ర:- నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కొమిరెడ్డి రాములు కుటుంబం ఉన్నదని. రాజకీయంలో గాడ్ ఫాదర్ లేకుండా కొమిరెడ్డి రాములు ఎదిగాడని మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జోతక్క అన్నారు. మంగళవారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రాములు నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు..స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుండి మరణించే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడని ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగుతూ ప్రజలకు సేవచేస్తమని తెలిపారు. కొమిరెడ్డి రాములు రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు కరమ్ చంద్ కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాడని కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.మెట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే లుగా రాములు, జోతక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపమని మేజర్ గ్రామ పంచాయతీ గా ఉన్న పట్టణాన్ని రాములు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మున్సిపాలిటీగా మార్చి మున్సిపల్ భవనాన్ని నిర్మించమని రోడ్లు, డ్రైనేజీలు, వ్యవసాయం కోసం కాలువల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ చేశాడని. ప్రతి మండలానికి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు, మార్కెట్ కమిటీ లు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మెట్‌పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెట్టడానికి కృషి చేసాడన్నారు. నిర్మల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను కలిపేందుకు మల్లాపూర్ మండలం ఓగులాపూర్ గోదావరి పై బ్రిడ్జి నిర్మాణం తమ హయంలోనే జరిగిందన్నారు. రైతుల కరెంట్ కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి మండలంలో సబ్ స్టేషన్ ల ఏర్పాటు చేసిన ఘనత రాములు కు దక్కిందన్నారు.మాజీ ఎమ్మెల్యే బడుగు బలహీనవర్గాలకు చేసిన మంచి పనులు రాములు రాజకీయ వారసుడు కరమ్ చంద్ ను గెలిపిస్తాయన్నారు.ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమి లేదని పక్కన ఉన్న సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి కోరుట్ల నియోజకవర్గంలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.కేవలం ఎమ్మెల్యే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కి మాత్రమే పనికి వస్తున్నాడని. ఇప్పుడు ఆ చెక్కులను ఎమ్మెల్యే కుమారుడు సంజయ్ తో నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేయిస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని తండ్రి, కొడుకులు చెక్కుల పంపిణీనికి తప్ప నియోజకవర్గ అభివృద్ధి మాత్రం చేయరన్నారు.

  • కాంగ్రెస్ కోవర్ట్ లకు టికెట్ లు ఇవ్వదు..కరమ్ చంద్

కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ లకు అసెంబ్లీ టికెట్ ఇవ్వదని కొందరు పూటకో పార్టీ మారేవారు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల అసెంబ్లీ టికెట్ వారికే వస్తుందని ప్రజలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని వారి మాటలు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కోమిరెడ్డి రాములు కుమారుడు కరమ్ చంద్ అన్నారు. తన తండ్రి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదని మరణించే వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడని. కాంగ్రెస్ పార్టీ కోసం సోనియా, రాహుల్ గాంధీ ల కోసం కొట్లడిన చరిత్ర తమ కుటుంబానికి ఉందన్నారు.రైతుల కోసం, ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 5 వందల రోజులు నిరాహార దీక్షలు,నిరసన కార్యక్రమాలు చేపట్టామని.పదవి ఉన్న లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశామన్నారు. కేవలం పదవుల కోసం ఆరాటపడి పార్టీలు మార్చే వారిని పార్టీ అధిష్టానం గమనిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే రాములు కుటుంబంలో రాములు రాజకీయ వారసునిగా తనకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్రోళ్ల నర్సక్క హనుమాన్లు యాదవ్, కౌన్సిలర్ లు యామ రాజయ్య, మహమ్మద్ షాకిర్ సిద్ధికి లు ఉన్నారు.