జిల్లా పోలీస్ కార్యాలయములో చాకలి ఐలమ్మ జయంతి వేడుకులు

జిల్లా పోలీస్ కార్యాలయములో చాకలి ఐలమ్మ జయంతి వేడుకులు

సిరిసిల్ల టౌన్, ముద్ర:చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, టౌన్ సి.ఐ ఉపేందర్, ఆర్.ఐ యాదగిరి, కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.