సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ పై అవిశ్వాస నోటీసు

సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ పై అవిశ్వాస నోటీసు
  •  చైర్మన్ గాజుల నారయణపై డైరక్టర్లు తిరుగుబాటు
  • సోంత పార్టీ లీడర్ పైనే ఏడాదిలో రెండవ సారి అవిశ్వాసం

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో పేరుగాంచిన అర్బన్ బ్యాంకు పాలకవర్గంలో మళ్లీ లుకలుకలు బయటపడ్డాయి. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు చైర్మన్ గాజుల నారయణపై మరోసారి మైజార్టీ డైరక్టర్లు అవిశ్వాసం నోటీసును జిల్లా సహకార అధికారికి ఈ నెల 22న అందించారు. ఏడాది క్రితం గాజుల నారయణపై ఇదేవ ఇధంగా అవిశ్వాసం పెడితే బీఆర్ఎస్ నాయకులు చీటీ నర్సింగరావు, జిందం చక్రపాణి రంగ ప్రవేశం చేసి సమస్యను సద్దుమనిగించి గాజుల నారయణను అవిశ్వాసం నుంచి బయటపడగొట్టారు. 9 మంది డైరక్టర్లు తాజాగా గాజుల నారయణపై పలు అభియోగాలు మోపి అవిశ్వాసం పెట్టి తొలగించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు పాలకవర్గం కు చెప్పకుండానే ఇద్దరు ఉద్యోగులను నియమించారని, అన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గాజుల నారయణపై అదే పార్టికి చెందిన డైరక్టర్లు పార్టీ అధిష్టానానికి సమాచారం లేకుండానే అవిశ్వాసం నోటీసు ఇవ్వడంపై రాజన్నసిరిసిల్ల జిల్లాలో రాజకీయ చర్చకు దారి తీస్తుంది. ఈ అవిశ్వాసం వెనక ఎవరైన బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి. గాజుల నారయణ పదవి కాలం మరో 11 నెలలు ఉంది. ఈ నేపధ్యంలో ఈ అవిశ్వాసం రాజకీయ దుమారాన్ని లేపుతుంది.

నాకు పదవి వ్యామోహం లేదు గాజుల నారయణ, అర్బన్ బ్యాంకు చైర్మన్

నాకు పదవి వ్యామోహం లేదు. నేను బ్యాంకులో ఏం తప్పు చేయలేదు. పాలకవర్గం సభ్యుల అనుమతి లేకుండా ఏ ఒక్క పని చేయలేదు. అవి తప్పుడు అరోపణలు. పదవి ఉంటే ఉంటుంది..పోతే పోతుంది.. గీ పదకొండు నెలలకు నేను ఇబ్బంది పడను.. ప్రాదేయపడను. నా నిజాయితీని నేను నమ్ముకుంటా.