భారత్ సరికొత్త అధ్యాయం

భారత్ సరికొత్త అధ్యాయం

చంద్రయాన్–3 ప్రయోగం సంపూర్ణ విజయం సాధించడం అభినందనీయం, భారలతీయులందరికీ గర్వకారణం. చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా చేర్చిన మొట్ట మొదటి దేశంగా, ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అరుదైన చరిత్రను సృష్టించింది. ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ సందర్భం. ఇస్రో, శాస్త్రవేత్తలకు, సిబ్బందికి, ఈ ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు. –కె. చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి


ప్రతి భారతీయుడూ గర్వించే క్షణమిది

విక్రమ్ చంద్రుడి మీద విజవంతంగా ల్యాండ్ అవడం యావద్భారతం గర్వించే క్షణం. ఇస్రో, చంద్రయాన్ టీమ్ కు హృదయపూర్వక అభినందనలు. ఇస్రో శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష ప్రయోగాలను మరింత ముందుకు తీసుకెళ్లాలి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగిరేస్తోంది. వివిధ దేశాలు ఈ దిశగా ప్రయత్నించి విఫలమై సందర్భాలలో భారత్ సాధించిన ఈ విజయం యావత్ ప్రపంచానికి దిక్సూచిగా ఉంటుంది. జి. కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి