చంద్రయాన్–-3 సాగిందిలా

చంద్రయాన్–-3 సాగిందిలా



14 జూలై: చంద్రయాన్–-3 అంతరిక్ష నౌక ప్రయోగం 
15 జూలై : కక్ష్యను 41,762 కిమీ x 173 కిమీకి పెంచడానికి మొదటి ప్రయత్నం 
17 జూలై : 41,603 కిమీ x 226 కిమీ వరకు 2వ కసరత్తు 
1 ఆగస్టు : చంద్రయాన్-–3 ట్రాన్స్‌ లూనార్ కక్ష్యలో ప్రవేశం 
5 ఆగస్టు : చంద్ర కక్ష్య 164 కిమీ x 18,074 కి.మీ వద్దకు చేరిక : కక్ష్య సర్దుబాటు
6 ఆగస్టు : చంద్ర కక్ష్య 170 కిమీ x 4,313 కి.మీకి సర్దుబాటు 
9 ఆగస్టు 3: 174 కి.మీ x 1,437 కిమీ చంద్ర కక్ష్యను నిర్వహించడానికి సర్దుబాటు
14 ఆగస్టు : 150 కిమీ x 177 కి.మీకి కక్ష్య సర్దుబాటు. 
17 ఆగస్టు : ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి విడివడిన ల్యాండింగ్ మాడ్యూల్ (విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్)
18 ఆగస్టు : ‘డీబూస్టింగ్’ ఆపరేషన్ ల్యాండింగ్ మాడ్యూల్ కక్ష్యను 113 కిమీ x 157 కి.మీకి తగ్గింపు  
20 ఆగష్టు : 134 కిమీ x 25 కిమీ వద్ద కక్ష్య స్థాపన: చివరి చంద్ర కక్ష్య, ల్యాండింగ్ సన్నాహాలు 
23 ఆగష్టు : సాయంత్రం 5:47 గంటలకు ల్యాండింగ్ షురూ, సాయంత్రం 6:04 గంటలకు ల్యాండింగ్

ఇది నవ భారతానికి నాంది

చంద్రుని దక్షిణ ధృవంలో మొట్టమొదటిసారి దిగిన ఘనత భారత దేశానికి దక్కింది. ఇది మునుపెన్నడూ లేనన్ని గొప్ప అద్భుత క్షణాలు. అమృత్‌కాలం ప్రారంభంలో గొప్ప విజయం సాధించాం. ఇది నవ భారతానికి నాంది. అంతరిక్ష రంగంలో నవ భారతం నవోదయం సాధించింది. మన కళ్ల ముందే గొప్ప చరిత్ర ఆవిష్కృతమైంది. భారతదేశ నూతన అదృష్టం ప్రారంభమైంది. చందమామపై విజయం సాధించాం. భారతీయులందరికీ, టీమ్ చంద్రయాన్, ఇస్రో సిబ్బందికి, శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు. అభినందనలు.