ఆసియాన్ - ఇండియా శిఖరాగ్ర సమావేశం

ఆసియాన్ - ఇండియా శిఖరాగ్ర సమావేశం
  • అధ్యక్షుడికి మోడీ అభినందన

జకార్తా: 20వ ఆసియాన్–-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్- – ఆసియాన్ భాగస్వామ్యం నాల్గవ దశాబ్దానికి చేరుకుందని, ఈ శిఖరాగ్ర సమావేశానికి సహ-అధ్యక్షుడు కావడం తనకు గర్వకారణమని అన్నారు. సమ్మిట్‌ను నిర్వహించినందుకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోను ఆయన అభినందించారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ కేంద్ర బిందువన్నారు. భారతదేశ ఇండో పసిఫిక్ చొరవతో ఆసియాన్‌కు ముఖ్యమైన స్థానం ఉందని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్ వాయిస్‌ని విస్తరించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. గ‌త సంవత్సరం భార‌త్-–ఆసియాన్ స్నేహ దినోత్సవం నిర్వహించామన్నారు. ప్రపంచ అనిశ్చితి వాతావరణం ఉన్నప్పటికీ భారత్-–ఆసియాన్ పరస్పర సహకారంలో స్థిరమైన పురోగతి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. జకార్తాలో జరిగిన ఆసియాన్-–ఇండియా సమ్మిట్‌లో, తైమూర్-లెస్టేలోని ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు మోదీ ప్రకటించారు.