శిఖరాగ్రం వైపే  అందరి చూపు

శిఖరాగ్రం వైపే  అందరి చూపు

న్యూఢిల్లీ: ప్రపంచదేశాల చూపు భారత్​లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జీ–20 శిఖరాగ్ర సమావేశాల వైపు ఉంది. ఈ సమావేశాలు 9, 10 తేదీల్లో జరగనుండగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది. ఈ సమావేశాల్లో ఆయా దేశాల మధ్య కొనసాగుతున్న వ్యాపార, వాణిజ్య అంశాలను చర్చించనున్నారు. అదే సమయంలో ప్రపంచంలోని ఆర్థిక అసమతుల్యతలను రూపుమాపే దిశగా చర్చించనున్నారు. ఆయా దేశాల్లోని సమస్యలను జీ–20దేశాలు ఏకమై ఎదుర్కొనేలా చర్చలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా పలుమార్లు పేర్కొన్న విషయం విదితమే. 

జీ–20 విశేషాలు..

సమ్మిట్​హాలులో 29 దేశాధినేతలు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులోని ప్రత్యేకమైన షాన్డిలియర్​ఉపయోగించారు. ఇది చెక్​రిపబ్లిక్​నుంచి దిగుమతి చేసుకున్నారు.

భారత మండపం..

40 లక్షల స్క్వేర్​ఫీట్​లలో భారత మండపం నిర్మాణం జరిగింది. 2016 అక్టోబర్​లో ప్రారంభించారు. జూలై 2023న పూర్తయ్యింది. నిర్మాణం కోసం రూ. 2700 ఖర్చయ్యాయి. 40 లక్షల  స్క్వేర్​ఫీట్​లలో నిర్మాణం జరగ్గా, బేస్​మెంట్​ప్రాంత నిర్మాణం 18 లక్షల స్క్వేర్​ఫీట్​లు, ఎగ్జిబిషన్​ ఏరియా 16 లక్షల స్క్వేర్​ఫీట్​లు, మీటింగ్, ఫుడ్​హాలు 10 లక్షల స్క్వేర్ ఫీట్​లు, ఎడ్మిన్​ ఏరియా ఒక లక్ష స్క్వేర్ ఫీట్​లతో నిర్మాణం పూర్తయ్యింది. ఈ మండపంలో మొత్తం 13 వేల మంది కూర్చునే వీలుంది. 5వేల వాహనాల పార్కింగ్​ సౌకర్యం 12 ఎగ్జిబిషన్​హాళ్లు ఉన్నాయి. 6 వేల మంది కూలీలు ఏడేళ్లు శ్రమించి దీన్ని నిర్మించారు. రెండు సంస్థల 200 మంది ఆర్కిటెక్చర్​లు, కన్సల్టెంట్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, డిజైనర్లు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. షాపూర్​జీ పల్లోంజీ గ్రూప్​ ఈ నిర్మాణ పనులు చేపట్టింది. 
సదస్సు కోసం ఢిల్లీ వ్యాప్తంగా రోడ్లన్నీ కొత్త తివాచీలు పరచినట్లుగా మెరుస్తున్నాయి. ప్రతీ చోటా జీ–20 శిఖరాగ్ర సమావేశాలకు, దేశాధినేతలకు స్వాగతం పలుకుతున్న తోరణాలు, పెయింటింగ్​లు కనిపిస్తున్నాయి. ఆయా రహదారులు సర్వాంగ సుందరంగా పెళ్లికూతురిలా ముస్తాబు చేశారు. సమావేశానికి వచ్చే అతిథుల కోసం 25 స్టార్​హోటళ్లు బుక్​ చేయగా, వెయ్యి లగ్జరీ కార్లను అందుబాటులో ఉంచారు. 

స్వాగతం..

కాగా దేశాధినేతలు, ప్రముఖులకు స్వాగతం పలకనున్నవారిలో పలువురి పేర్లను పీఎంఓ అధికారికంగా ప్రకటించింది.  అమెరికా రాష్ర్టపతి జో బైడెన్, చైనా ప్రధాని లీ కియాంగ్​లకు మంత్రి వీ.కె. సింగ్​స్వాగతం పలకనున్నారు. ఇటలీ పీఎం జార్జియాకు శోభా, బంగ్లాదేశ్​ పీఎం షేక్​హసినాకు దర్శన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదాలకు కేంద్రమంత్రి అశ్వినీ చౌబేలు స్వాగతం పలకనున్నారు. దక్షిణ కొరియా రాష్ర్టపతి యూ సుక్​ యెఓల్, ఆస్ర్టేలియా ప్రధాని ఎంథనీ అల్బెనీజ్​కు రాజీవ్​చంద్రశేఖర్, బ్రెజిల్​రాష్ర్టపతి లులా డి సిల్వాకు నిత్యానందరాయ్, ఫ్రాన్స్​ రాష్ర్టపతి ఇమ్మాన్యూయేల్ కు అనుప్రియా పటేల్​, జర్మనీ చాన్స్​లర్​కు భానుప్రతాప్​సింగ్​వర్మలు స్వాగతం పలకనున్నారు. మారిషస్​ప్రధాని ప్రవీణ్​కుమార్​ జగన్నాథ్​కు శ్రీపాత నాయక్, సింగపూర్​ పీఎంకు లీ సీన్​లూంగ్ కు మురుగన్, యూరోపియన్​ యూనియన్​ అధ్యక్షులు ఉర్సులాకు ప్రహ్లాద్​సింగ్​పటేల్, స్పెయిన్​రాష్ర్టపతికి శాంతన్​ఠాకూర్​లు స్వాగతం పలకనున్నవారిలో ఉన్నారు. 

జీ20లో శనివారం షెడ్యూల్..

జీ–20లో శనివారం ఉదయం (9 సెప్టెంబర్) 9.30కు అన్ని దేశాల ప్రతినిధులు భారతమండపం కన్వెన్షన్​కు చేరుకుంటారు. ప్రధాని నరేంద్రమోడీ వెంట ఫోటోషూట్​జరగనుంది. అనంతరం లీడర్స్​ లాంజ్​లో  సమావేశం  కానున్నారు. 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. మొదటి సమావేశానికి ‘వన్​ అర్త్’ (ఒకే భూమి) పేరు పెట్టారు. అనంతరం మధ్యాహ్నం 1.30 వరకు లంచ్​కూడా ముగిస్తారు. అనంతరమే ద్వైపాక్షిక చర్చల నిర్వహణ ఉంటుంది.  మధ్యాహ్నం 3 గంటలకు రెండో సమావేశం ‘వన్​ఫ్యామిలీ’ (ఒకే కుటుంబం) పేరును ఖరారు చేశారు. ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశం అనంతరం ప్రతినిధులు, దేశాధినేతలు వారి వారి హోటళ్లకు చేరుకుంటారు. సాయంత్రం 7 గంటలకు దేశాధినేతలు, ప్రతినిధులు కలిసి విందులో పాల్గొంటారు. ఇక్కడ వెల్కమ్​ఫోటోషూట్​కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 8 నుంచి 9.15 నిమిషాల వరకూ విందు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలుదేశాధినేతలు,ప్రతినిధులు అంతర్గత విషయాలపై చర్చించుకునే అవకాశం కూడా ఉంది. రాత్రి 9.45 గంటలకు అతిథులు ఎవ్వరి హోటళ్లకు వారు చేరుకుంటారు.

జీ–20లో ఆదివారం షెడ్యూల్..

10 సెప్టెంబర్​ఆదివారం ఉదయం 8.15 గంటలకు ఆయాదేశాధినేతలు,ప్రతినిధులంతా రాజ్​ఘాట్​ చేరుకుంటారు. ప్రపంచశాంతి కోసం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తారు. మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు. భక్తిగీతాలాపన కార్యక్రమం ఉంటుంది. తిరిగి కన్వెన్షన్​సెంటర్​లోని లీడర్స్​ లాంజ్​కి చేరుకుంటారు. 9.40 నుంచి 10.15 పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా నిర్వహించే చెట్లు నాటుతారు. 10.30 గంటలకు మూడో సమావేశం ‘వన్​ఫ్యూచర్’ (ఒకే భవిష్యత్) ప్రారంభమవుతుంది. ఇందులో ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తారు. 12.30 గంటలకు సమావేశంలో జరిగిన ఒప్పందాలు తదితరాలపై సంతకాల కార్యక్రమాన్ని చేపడతారు. 

భారీ భద్రత..

సమావేశాల ముగింపు వరకూ 50వేల మంది ఢిల్లీ పోలీసులు భద్రతలో కొనసాగుతుండగా, ఎన్​ఎస్​జీ, సీఆర్పీఎఫ్, సీఏపీఎఫ్, ఆర్మీ 80 వేలమంది జవాన్లు భద్రతా విధుల్లో ఉండనున్నారు. ఇందులో బుల్లెట్​ఫ్రూఫ్​వాహనాలు, డ్రోన్​ఎంట్రీ, ఎయిర్​స్ర్టైయిక్​బృందాలు, రఫెల్​ఫైటర్​జెట్లు, యుద్ధ విమానాలు, గాలిలో 80 కిలోమీటర్ల వరకూ లక్ష్యంగా గురి పెట్టగలిగే మిస్సైళ్లు, నాలుగు ఎయిర్​పోర్టులలో హై అలర్ట్​ ప్రకటించారు. 

జీ–20కి దోమల బెడద..

జీ–20 సమావేశానికి దోమల బెడద ఉంటుందన్న ఆందోళనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ పూర్తయ్యింది. ఎక్కడా ఎలాంటి నీరు నిలవకుండా, చెత్త లేకుండా జాగ్రత్త వహిస్తున్నారు. దోమల లార్వాను తినే చేపలను, తాబేళ్లను 180 చిన్నా చితక చెరువులలో భారీగా వదిలారు. దీంతో దోమలు వృద్ధి చెందకుండా అంతమవుతాయి. 15వేల టన్నుల చెత్తను సేకరించి వేరే చోటికి తరలించారు. సమావేశానికి ఏడు లక్షల పూలమొక్కలు ఏర్పాటు చేశారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు వివిధ రకాల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. 

విందుకు15 వేల వెండి పాత్రలు సిద్ధం..

విదేశీ అతిథులకు భారత ప్రత్యేక వంటకాలను రుచిచూపించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 250 మంది ఆయా రాష్ర్టాల నుంచి చేయి తిరిగిన చెఫ్​లను రప్పించారు. అతిథులకు వీరి రుచులతో మెప్పించనున్నారు. అన్ని రాష్ర్టాలకు సంబంధించిన వంటకాలను విందులో ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు అతిథుల కోసం 15వేల వెండి ప్లేట్లను సిద్ధం చేశారు. ఇందుకోసం జైపూర్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక కళాకారులు 200మంది రాత్రింబవళ్లు శ్రమించారు.వీటిని రూపొందించేందుకు 50వేల గంటలు పట్టాయని ప్రభుత్వం వెల్లడించింది.