ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి కార్యాలయంలో ఘనంగా ఉగాది, జన్మదిన వేడుకలు

ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి కార్యాలయంలో ఘనంగా ఉగాది, జన్మదిన వేడుకలు

ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల జెడ్పిటిసి కార్యాలయంలో ఘనంగా శోభ కృత నామ  ఉగాది సంబరాలను అదేవిధంగా మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి జన్మదిన వేడుకను బుధవారం మండల జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. సంప్రదాయబద్ధంగా కుండలో మామిడికాయ పచ్చడిని జడ్పిటిసి లక్ష్మణ్ రావు స్వయంగా తయారుచేసి అదేవిధంగా పిండి వంటలతో తయారుచేసిన పోలెలను బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం మండల మాజీ సేస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి జన్మదినం సందర్భంగా శాలువతో సత్కరించి కేక్ కట్ చేయించారు.

ఈ కార్యక్రమంలో మండల సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపీటీసీ ఎనగందుల అనసూయ నర్సింలు, వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్,మండల మహిళా అధ్యక్షురాలు అప్సర ఉన్నిసా అజ్జు, నాయకులు నంది కిసన్, మీసం రాజం, గూలపల్లి నరసింహారెడ్డి, బాధ రమేష్, మేగి నరసయ్య,రాజు నాయక్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.