ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం వాటా ఉంది...

ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం వాటా ఉంది...
  • కాంగ్రెస్ నాయకులు మద్యం తాగమని సోనియామ్మపై ప్రమాణం చేయాలి
  • ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:ప్రతి ఇందిరమ్మ ఇంటిలోనూ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వాటా ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లలో ఓటు అడిగే హక్కు టిఆర్ఎస్కు లేదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం అసంబంధం అన్నారు. 2004 నుండి 2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లపై లబ్ధిదారులకు వేసిన నాలుగు వేల కోట్ల అప్పును రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే... ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలోనూ కేసీఆర్ ప్రభుత్వానికి బాధ్యత, హక్కు ఉంది. జీవన్ రెడ్డి హయాంలో జగిత్యాలలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించారు శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. దళితుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, కాంగ్రెస్ హయాంలో దళితులకు జరిగిన మేలేమీ లేదన్నారు. ఎస్సీ కాలనీలో 2004-2014 మధ్య నిర్మించిన ఇండ్లన్నింటికీ బాకీ మాఫీ చేసింది కేసీఆరే... బీసీలకు ఎస్సీ మైనార్టీలకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని జీవన్ రెడ్డి అడగడంలో అర్థం లేదు,  75 వేల కోట్ల రైతుబంధులో 80% లబ్ధిదారులు బిసి ఎస్సి వర్గాల వారే అన్నారు. రైతు బీమా కింద వచ్చిన 5000 కోట్లలో ఎక్కువ లబ్ధిదారులు దళిత బలహీన వర్గాల వారే... మైనార్టీ వర్గాల వారి సంక్షేమానికి కృషి చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికులకు రూ. 2000  జీవనభృతిని ప్రవేశపెట్టిన గొప్ప సంస్కారవంత ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అన్నారు.  కాంగ్రెస్ పాలనలో జరిగిన అవకతవకల వల్లే తెలంగాణ ప్రజలు బతుకుతెరువు కోసం బొంబాయి సూరత్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లి బీడీ కార్మికులుగా మారారు... చేనేత కార్మికులను ఆరోజే ఆదుకొని ఉంటే బీడీ కార్మికుల వ్యవస్థ, దానిపైన ఆధారపడిన కార్మికుల అనారోగ్య సమస్యలు తెలంగాణలో ఉండేవి కాదన్నారు. తెలంగాణలో దళితులు బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలను ఓటు హక్కు అడిగి నైతికత కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డికి లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు బాలే శంకర్, ఓల్లం మల్లేశం, దుమాల రాజకుమార్, జుంబర్తి శంకర్, సుధాకర్  పాల్గొన్నారు