పుట్ట మధు కు బీఆర్ఎస్ బీ-ఫామ్ అందించిన సీఎం కేసీఆర్‌

పుట్ట మధు కు బీఆర్ఎస్ బీ-ఫామ్ అందించిన సీఎం కేసీఆర్‌

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: బీఆర్‌ఎస్‌పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్‌  మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు కు బీఆర్ఎస్ బీ- ఫామ్ సోమవారం అందజేశారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్ట మధూకర్‌ కు ఆయన బీ-ఫామ్ అందజేశారు. గత నెలలో మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్ట మధును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ-ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ తనపై నమ్మంకం తో మూడోసారి పార్టీ భీ-ఫామ్ అందించిన సీఎం కేసిఆర్ గారికి మరియు సహకరించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గారికి హృయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట యువ నాయకుడు పుట్ట శ్రీహర్ష ఉన్నారు.