కాలుష్య రహిత సమాజానికి కృషి చేయాలి

కాలుష్య రహిత సమాజానికి కృషి చేయాలి

జనగామ టౌన్‌, ముద్ర : కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మాజీ కల్నల్‌ డాక్టర్‌‌ మాచర్ల భిక్షపతి సూచించారు. టీజీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం జనగామలోని పలు ఓ ప్రైవేట్ స్కూల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

కాలుష్యం ద్వారా ఓజోన్ పొర రోజురోజుకూ క్షీణిస్తుందన్నారు. మొక్కల పెంపకం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి దానిని రక్షించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల సురేష్, జిల్లా అధ్యక్షుడు గన్ను కార్తీక, జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ కౌశిక్, పట్టణ అధ్యక్షుడు వెంపటి అజయ్, నాయకులు చింటూ, ఈశ్వర్, సాయి రాజు పాల్గొన్నారు.