చాగల్ లో కేసీఆర్, కడియం చిత్రపటాలకు క్షీరాభిషేకం.. రూ.1 కోటితో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 

చాగల్ లో కేసీఆర్, కడియం చిత్రపటాలకు క్షీరాభిషేకం.. రూ.1 కోటితో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 

స్టేషన్ ఘన్‌పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్ లో రూ. 1 కోటి వ్యయంతో నిర్మించే కమ్మరిపేట రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గ్రామ సర్పంచ్ పోగుల సారంగపాణి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా హామీలతో ముందుకు సాగని సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎన్ఆర్ఈజీఎస్ నుండి రూ.35 లక్షలు, కూడా నుండి రూ.55 లక్షలు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మంజూరు చేయించినట్లు తెలిపారు. దాదా కోటి రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగన పూర్తి చేసి కమ్మర్ పేట్ తో సహా వ్యవసాయ బావల వద్దకు వెళ్లే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజిత, ఎంపీటీసీ స్వరూప, మాజీ సర్పంచ్ ఆకుల రజిత, మాజీ ఎంపీటీసీలు సత్యనారాయణ, సామిల్ కడియం సోషల్ మీడియా ఇంచార్జ్ భాస్కుల సమ్మయ్య వార్డు సభ్యులు కుమార్, యాక లక్ష్మి, అనిత, విజయ, విక్రమ్, రమేష్, జయలక్ష్మి, చిరంజీవి, సంతోష్, జయశాల నాయకులు ఆకుల నరసయ్య, ఆకుల రవి, సత్తు రవి, అన్నెపు ఐలయ్య, లక్ష్మీనారాయణ, కొమురయ్య, అన్నెపు కుమార్, ఆవుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.