‘గ్రీన్ వుడ్’ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలి

‘గ్రీన్ వుడ్’ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలి
  • భూ తగాదాకు పిల్లలను తీసుకెళ్లిన ప్రిన్సిపాల్
  • యాజమాన్యంపై విద్యార్థి సంఘాల మండిపాటు

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ మండలం వడ్లకండలోని గ్రీన్ వుడ్‌ హైస్కూల్‌పై బాల కార్మిక చట్టం ప్రకారం కేసు నమోదులు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ జిల్లా కమిటీలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ఆయా సంఘాల ప్రతినిధులు శనివారం జనగామ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ సృజన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం, ఏబీవీపీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ సంతోష్ మాట్లాడుతూ వడ్లకొండలో ఉన్న గ్రీన్ వుడ్ హైస్కూల్ ప్రిన్సిపాల్‌ సల్లాఉద్దీన్‌కు కొద్ది రోజుల ఓ భూ తగాదా జరుగుతోంది.

అయితే ఆ గొడవకు ఎలాంటి సంబంధం లేని స్కూల్ పిల్లలను అక్కడికి తీసుకెళ్లి డోజర్‌కు అడ్డంగా కూర్చోబెట్టారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై నమ్ముకంతో బడికి పంపితే ఇలా తమ సొంత గొడవలకు వారిని వాడుకోవడం సరికాదన్నారు. దీనిపైన ఎడ్యుకేషన్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా పాఠశాలలో ఫైర్ సేఫ్టీ లేదని, విద్యా హక్కు చట్టం ప్రకారం వసతులు లేవని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హృతిక్, నాయకులు కార్తీక్, నరేశ్‌, వంశీ, ఉదయ్ పాల్గొన్నారు.