మల్లు స్వరాజ్యం సేవలు మరువలేం: సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి

మల్లు స్వరాజ్యం సేవలు మరువలేం: సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి

ముద్ర, జనగామ టౌన్: సమాజానికి మల్లు స్వరాజ్యం చేసిన సేవలు మర్చిపోలేమని సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభ  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కనకారెడ్డి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ పుణ్యదంపతులకు 1931లో జన్మించారాన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ సామాన్యుల కష్టాలను సహించలేక 1945-46లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాల్గొని నిజాం సర్కారును గడగడలాడించారని గుర్తుచేశారు.

75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ, ప్రజాప్రస్థానంలో ఆమె రెండు సార్లు (1978, 1983లో) తుంగతుర్తి శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు పోత్కనూరి ఉపేందర్, జోగు ప్రకాష్, సుంచు విజేందర్, భూక్యా చందు నాయక్, బిట్ల గణేష్, పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం, బోట్ల శ్రావణ్, పల్లెర్ల లలిత, చిర్ర రజిత, బూడిది అంజమ్మ, చిదురాల ఉపేందర్, పాము శ్రీకాంత్, గిరి తదితరులు పాల్గొన్నారు.