'ప్రేమ సదనం'లో అన్నదానం

'ప్రేమ సదనం'లో అన్నదానం

ముద్ర, జనగామ (దేవరుప్పుల): జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరుకు చెందిన యువ నాయకుడు బబ్బూరి రమ శ్రీకాంత్ గౌడ్ పెళ్లిరోజు వేడుకలను సీతారాంపురంలోని ప్రేమ సదనం ఆశ్రమంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బబ్బురి నాగరాజు, కారుపోతుల శ్రీనివాస్, ప్రేమ సదనం ఆశ్రమ ఇంచార్జి బ్రహ్మచారి, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.