ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం నాయకులు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం నాయకులు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: ఐకెపి కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని బీజేవైఎం నాయకులు శుక్రవారం ముట్టడించారు. విషయం తెలిసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ రైతు పండించిన పతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఐకెపి కేంద్రాల్లో రైతులు నెలల తరబడి పడి కాపులు  కాస్తున్నారని ఆరోపించారు.

గోనెసంచుల సరఫరా లేక, టోకెన్లు ఇవ్వక, తూకం వేసిన ధాన్యం సకాలంలో మిల్లులకు తరలించక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు స్పందించి ఐకెపి కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే తూకం వేసి మిల్లులకు తరలించి రైతుకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేసిన  బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పుండ్రు నవీన్ రెడ్డి, మండల అధ్యక్షుడు నువ్వు నావత్ రాజ్ కుమార్, కొలనుపాక శరత్ కుమార్, జఫర్గడ్ ప్రధాన కార్యదర్శి కోరుకొప్పుల నగేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బుర్ర తిరుపతి, సోషల్ మీడియా ఇంచార్జ్ ఇనుగాల కార్తీక్ రెడ్డి, దళిత మోర్చా నాయకుడు ప్రదీప్ లను సీఐ రాఘవేందర్, ఎస్సై శ్రావణ్ కుమార్ అరెస్టు చేశారు.