'మల్లన్న గండి'ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

'మల్లన్న గండి'ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

 ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ - స్టేషన్ ఘ న్ పూర్ మండలాల పరిధిలో ఉన్న మల్లన్న గండి రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య మంగళవారం పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు మత్తలు పడి వాగులు వంకలు పొరులుతున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఉండేందుకు అధికారులను అప్రమత్తం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పైనుండి వర్షం నీరు అధికంగా వచ్చి చేరుతుండడంతో దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట చిల్పూర్ మండల రెవెన్యూ అధికారులు ఉన్నారు.