కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు

కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు
  • సీఎంకు జనగామ భయం పట్టుకుంది
  • అందుకే జిల్లాకు రెండో సారి వస్తుండు
  • ‘పల్లా’కు దమ్ముంటే ఎమ్మెల్సీకి రాజీమానా చేయాలి
  • జనగామ కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ: మోసపూరి వాగ్దానాలతో రెండు సార్లు అధికారం అనుభివించి కేసీఆర్‌‌ ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు రెడీగా ఉన్నారని జనగామ కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయారన్నారు. కేసీఆర్‌‌ దుర్మార్గ పాలనకు ప్రజలు విసిగిపోయారని ఈసారి ఆయనను ఇంటికి పంపడం ఖాయమన్నారు. ఇక జనగామ నియోజకవర్గం పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ఎక్కడి వాడని కొమ్మూరి ప్రశ్నించారు. అయినా పల్లాకు ఎమ్మెల్సీ పదవి ఉన్నాక మళ్లీ ఎమ్మెల్యే ఎందుకన్నారు. బీఆర్‌‌ఎస్‌ ఆయనకంటే మంచి లీడర్లు లేరా, ఉద్యమకారులు లేరా వారికి ఎమ్మెల్యేగా ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు.

బీఆర్‌‌ఎస్‌ లీడర్ల కూడా ఆ పార్టీ జరుగుతున్న పరిణామాలను గమనించాలని సూచించారు. మోసపు పార్టీని వీడి బయటకు రావాలని పిలుపు ఇచ్చారు. ఒకవేళ నిజంగా రాజేశ్వర్‌‌రెడ్డికి ఎమ్మెల్యేగా గెలుస్తానని నమ్మకం ఉంటే ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే పల్లాను జనగామ జనం ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తిస్తార్నారు. కేసీఆర్‌‌ పక్కన ఉంటానని చెప్పకుంటున్న పల్లా ఆయనను పక్కదారి పట్టించడమే లక్ష్యంగా పనిచేస్తాడని ఆరోపించారు. చేర్యాల రెవెన్యూ డివిజన్‌ కాకుండా అడ్డుకున్నది పల్లానే అని కొమ్మూరి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌‌కు జనగామలో తమ పార్టీ ఓడిపోతుందని తెలుసని, అందుకే ఆ భయంతోనే ఓటర్లకు మాయమాటలు చెప్పేందుకు మరోసారి నియోజకవర్గానికి వస్తున్నాడని ఎద్దేవ చేశారు. బీఆర్‌‌ఎస్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

నేడు జనగామకు రేవంత్‌రెడ్డి..
జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించే విజయోత్సవ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారని కొమ్మూరి తెలిపారు. స్థానిక ప్రెస్టన్‌ పాఠశాల గ్రౌండ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీసీసీ మెంబర్‌‌ చెంచారపు శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రమళ్ల సుధాకర్,  కొత్త కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ధర్మ గోవర్ధన్ రెడ్డి, చరబుడ్ల దయాకర్ రెడ్డి , వడ్లకొండ పీఏసీఎస్‌ డైరెక్టర్  వంగల మల్లారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేతలు మేడ శ్రీనివాస్, సుంకరి శ్రీనివాస్ రెడ్డి, బనుక శివరాజ్ యాదవ్, బుచ్చిరెడ్డి, సర్యల నర్సింగరావు, ఎంపీటీసీ బాలరాజు, కృష్ణ స్వామి, ఎండీ అన్వర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగరబోయిన మల్లేశ్, గాదెపాక మచందర్, జక్కుల వేణు మాధవ్, రామగళ్ల విజయ్​, రంగరాజు ప్రవీణ్, మినుకురి మహేందర్ రెడ్డి, దోర్నాల వెంకటేశ్వర్లు, తాటి కనుక స్వామి, దాసరి క్రాంతి, పిట్టల సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.