సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ‘పొన్నాల’

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ‘పొన్నాల’
  • సభలో హర్షాతీరేకాలు
  • బలహీన వర్గాలను కాంగ్రెస్ అణచివేస్తుంది

జనగామ టౌన్, ముద్ర :  కులగణన పేరుతో సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ అణచివేయడానికి ప్రయత్నిస్తుందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.  బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌‌తో  కలిసి పాల్లొన్నారు. మొదట సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి పొన్నాల మాట్లాడుతూ 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి, జనగామ జిల్లా ప్రజలకు ఆయా హోదాల్లో సేవలను అందజేసానని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలుగా కొందరి పెత్తనం వల్ల భ్రస్టు పట్టందన్నారు.  గత కొంతకాలంగా తనకు సైతం అవమానాలు, అవహేళనలు జరిగాయని చెప్పుకొచ్చారు. కాగా సీఎం కేసీఆర్‌‌తో పొన్నాల లక్ష్మయ్య నేరుగా సభకు రావడం, ఆయన మట్లాడుతున్న క్రమంలో ప్రజల నుంచి భారీ స్పందన లభించడంతో సభలో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.