స్టేషన్ ఘన్ పూర్ ను...

స్టేషన్ ఘన్ పూర్ ను...
  • సిద్దిపేట సరసన నిలబెడతా
  • ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: గ్రామ గ్రామాన ఉన్న సమస్యలు తెలిసిన నేను వాటన్నింటినీ పరిష్కరించి అభివృద్ధిలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాన్ని సిద్దిపేట సరసన నిలబెడతానని ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్, చిన్న పెండ్యాల స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ పార్టీ కార్యాలయం ప్రారంభించి గ్రామస్థాయి ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1994, 99లో ఎమ్మెల్యేగా 2014లో మీ ఆశీర్వాదంతో ఎంపీగా ఎన్నికయ్యాను. 30 ఏండ్లుగా రాజకీయాల్లో గుర్తింపు వచ్చింది అది మీరు పెట్టిన రాజకీయ బిక్ష. 

ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఎమ్మెల్సీగా శక్తి మేరకు అభివృద్ధి చేశా. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరో మారు మీ ముందుకు వచ్చా ఆశీర్వదించండి. అభివృద్ధిలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాన్ని సిద్దిపేట సరసన నిలబెడతా అన్నారు. "6 గ్యారంటీలు ఎలా సాధ్యం"కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అమలు చేయని 6 గ్యారంటీలను అధికారం లేని తెలంగాణలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక స్కాములు, అవినీతిలో కూరుకు పోయిందన్నారు." బిజెపికి సింగిల్ డిజిట్"కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని కలలు గంటున్న బిజెపికి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందన్నారు. గత పది ఏళ్లుగా ఉచిత కరెంటు, రైతు బీమా, రైతుబంధు, ఆసరా పెన్షన్లు, కెసిఆర్ కిట్టు, దళిత బందు, కళ్యాణ లక్ష్మి, ధాన్యం కొనుగోలు మొదలైన పథకాల అమలులో ఆదర్శంగా నిలిచిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎంపీపీ సరిత బాలరాజు, వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, సర్పంచులు ఉద్యమారి రాజ్ కుమార్, చల్ల ఉమాదేవి, మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీలు బెల్లపు వెంకటస్వామి, తాళ్లపల్లి ఉమాసమ్మయ్య, నాయకులు రాపోలు మధుసూదన్ రెడ్డి, అక్కనపల్లి బాలరాజు, ఇల్లందుల సుదర్శన్, తాళ్లపల్లి సంపత్ కుమార్, ఐలోని సుధాకర్, తాళ్లపల్లి క్రాంత్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్, ముఖ్య రమేష్ నాయక్, రాజ్ మహమ్మద్, మాచర్ల ప్రవీణ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.