ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా “బత్తిని”

ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా “బత్తిని”

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: వ్యక్తిత్వ వికాస శిక్షణారంగం ఇంపాక్ట్ సంస్థ నుండి సర్టిఫైడ్ ట్రైనర్ గా జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన బత్తిని భాస్కర్ శిక్షణ పూర్తి చేసుకొని ట్రైనర్ గా అర్హత సాధించారు. 32 రోజుల పాటు ఆన్లైన్ క్లాసులు ఆడియో, వీడియో అసైన్మెంట్స్ పూర్తి చేసిన సందర్భంగా సోమవారం సికింద్రాబాదులోని మినర్వా గ్రాండ్ హోటల్లో నిర్వాహకులచే ట్రైనర్ గా సర్టిఫికెట్ అందుకున్నారు.

ఆఫ్లైన్ క్లాసులుగా ముఖాముఖి ఒకటి, రెండు తేదీలలో రోజుకు 12 గంటల పాటు శిక్షణ క్లాసులు నిర్వహించారు. పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ లాంటి 22 అంశాల్లో ఈ శిక్షణ క్లాసులు జరిగాయి. ఈ తరగుతుల్లో అన్ని విభాగాలలో అర్హత సాధించి సర్టిఫికెట్ పొందిన బత్తిని భాస్కర్ మాట్లాడుతూ ఇంపాక్ట్ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు, గ్రామీణ ప్రాంత యువతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది అన్నారు.