‘ఆర్యభట్ట’లో బోనాల పండుగ

‘ఆర్యభట్ట’లో బోనాల పండుగ

జనగామ, ఆయుధం : జనగామలోని ఆర్యభట్ట పాఠశాలలో శనివారం స్కూల్‌లో శ్రావణమాసం బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. బోనం దాని విశిష్టత గురించి విద్యార్థినులకు మహిళా టీచర్లు అవగాహన కల్పించారు. ఈ వేడుకల్లో అంతా సంప్రదాయ దుస్తుల్లో హాజరై సందడి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సృజన, కరస్పాండెంట్‌ సురేష్‌ చంద్ర, ఉపాధ్యాయినులు స్వరూప, జ్ఞానేశ్వరి,రేఖ, విజిత, శిరీష, నిరోషా, అనూష, ఉమాదేవి, రమాదేవి, వసుంధర, మనోజ్‌ పాల్గొన్నారు.