ఎమ్మెల్యే@ ట్రాఫిక్‌ పోలీస్‌..


ముద్ర ప్రతినిధి, జనగామ:-జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సోమవారం ట్రాఫిక్‌ పోలీస్‌ అవతారం ఎత్తారు. ఎమ్మెల్యే ట్రాఫిక్ పోలీస్‌ అవ్వడం ఏమిటని ఆశ్యర్యపోకండి.. అసలు విషయం ఇది.. జనగామ– దుద్దెడ రహదారి విస్తరణలో భాగంగా జనగామ మండలం శామీర్‌‌పేట వద్ద రోడ్డుపై భారీ వృక్షం కొట్టి వేశారు. అవి రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కారులో నుంచి దిగి తన వ్యక్తిగత సిబ్బంది, ప్రజలతో కలిసి చెట్లను రోడ్డుపై నుంచి తొలగించారు. దాదాపు 20 నిమిషాలు అక్కడే ఉండి వచ్చేపోయే వాహనాలను అదుపు చేస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.