‘కొత్త’ ఉత్సాహంతో...

‘కొత్త’ ఉత్సాహంతో...

ఓటింగ్‌లో ‘యువ’గళం
మొదటి సారి ఓటేసిన యువత
 జనగామ జిల్లాలో 21,433 మంది కొత్త ఓటర్లు

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లాలో కొత్తగా నమోదైన యువ ఓటర్లు గురువారం ఉత్సాహంగా ఓటేయడం కనిపించింది. జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 21,433 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. జనగామ 7,499 మంది, స్టేషన్‌ఘన్‌పూర్‌‌ 6,174, పాలకుర్తి 7,760 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఇందులో చాలా వరకు యువ ఓటర్లే ఉన్నారు. వీరంతా దాదాపు ఓటేసినట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని చాలా పోలింగ్‌ స్టేషన్లలో ఉదయం 11 నుంచి 2 గంటల వరకు యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

కొత్త అనుభూతి..
మడూరి రిషిత, 2వ వార్డు, జనగామ
నేను మొదటి సారి ఓటేసిన. ఓటు వేయడం ఓ కొత్త అనుభూతినిచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కురూ ఓటు వేయాలి. దీనిని ఒక బాధ్యతగా గుర్తించాలి.

ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన..
సుధగాని నిఖిత, 23వ వార్డు, జనగామ
నాకు ఈ సంవత్సరంమే ఓటు హక్కు వచ్చింది. ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుంచి ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా అని ఎదురుచూసిన. మొదటి సారి ఓటు వేయడం మర్చిపోలేని అనుభూతి.