వడ్ల కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు – జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య

వడ్ల కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు – జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ: జిల్లాలో ధాన్యం కొనుగోలుగకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జనగామ కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య చెప్పారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.  సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో  111,  సహకార శాఖ ఆధ్వర్యంలో 89 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధిత అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని మౌలిక వసతులు కల్పించాలని, తాగునీరు, మరుగుదొడ్లు, టెంట్లు, కుర్చీలు, కరెంటు, గన్నీ సంచులు, తేమశాతం కొలిచే యంత్రాలు, అన్ని రిజిస్టర్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆఫీసర్లకు సూచించారు. ధాన్యం కొనుగోలుపై ఇప్పటికే పలు దాఫాల్లో నిర్వాహకులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు టార్గెట్‌ను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ జి. రామ్ రెడ్డి. డీసీఎస్ఓ ఎం.రోజారాణి, డీఏవో వినోద్ కుమార్, డీఎంవో నాగేశ్వరశర్మ, డీఎం సివిల్ సప్లై సంధ్యారాణి, ఏపీడీ నూరుద్దీన్, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.