అంబేద్కర్‌‌ అందిరి వాడు

అంబేద్కర్‌‌ అందిరి వాడు
  • ఘనంగా జయంతి వేడుకలు
  • నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

ముద్ర ప్రతినిధి, జనగామ: డాక్టర్‌‌ బి.ఆర్‌‌ అంబేద్కర్‌‌ అందరివాడని పలువురు వక్తలు అన్నారు. అంబేద్కర్‌‌ జయంతి వేడుకలను జనగామ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జడ్పీచైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డితో పాటు అడిషనల్‌ కలెక్టర్‌‌ ప్రపుల్‌ దేశాయ్‌, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చీఫ్‌ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్‌‌ రచించిన రాజ్యంగా వల్లే దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. తెలంగాణ సర్కారు ఏర్పడిన తర్వాత దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి కృషి చేసిన ఘనత కేసీఆర్‌‌కే దక్కుతుందన్నారు.

దళిత బంధుతో రాష్ట్రంలోని ఎంతో మందికి భరోసా ఇచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో 125 అడుగుల ఎత్తు కలిగిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్ రెడ్డి, ఆర్డీవో మధుమోహన్‌, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కొర్నిలియస్, మున్సిపల్‌ చైర్‌‌ పర్సన్‌ పోకల జమున, కమిషనర్‌‌ రజిత, జనగామ జిల్లా ప్రముఖులు డాక్టర్ రాజమౌళి, డాక్టర్ సుగుణాకర్ రాజు, డాక్టర్ భిక్షపతి, అంబేద్కర్‌‌ సంఘం నాయకులు మల్లిగారి మధు, బొట్ల శేఖర్, మల్లిగారి రాజు, ఉడుగుల నర్సింహులు, తుర్కపల్లి యాదగిరి, బాలయ్య, గజవెల్లి ప్రతాప్‌, హైకోర్టు న్యాయవాది సాదిక్‌ అలీతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.