ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ లీడర్ల అర్ధనగ్న ప్రదర్శన

ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ లీడర్ల అర్ధనగ్న ప్రదర్శన

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ పట్టణంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జనగామ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరద నీటిలో కూర్చుని అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షం తగ్గి 24 గంటలు గడిచిన జనగామ పట్టణంలోని హైదరాబాద్, హన్మకొండ ప్రధాన రహదారి, కుర్మవాడ ఏరియాలో భారీగా వరద నీళ్లు వస్తున్నాయన్నారు. దీంతో వ్యాపారస్తులు, ప్రయాణికులు చుట్టు పక్కల ఉండే నీవాసం ఉండే ప్రజలందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇంత వరకు ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు.

ఈ పరిస్థితికి వారి అసమర్ధత, నిర్లక్ష్యమే కారణం అన్నారు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి డ్రైనేజీలు కూడా సరిగ్గా కట్టలేదని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, బీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ చింతకింది మల్లేష్, జనగామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మాజీద్, మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ జాఫర్ షరీఫ్, ఉపాధ్యక్షుడు సుల్తాన్ గోవింద్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నోముల రాజు, కొండ శ్రీను, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుదు సౌడ మహేష్, ఎండీ అజామ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.