మల్లన్న గండి రిజర్వాయర్ ను పరిశీలించిన కేంద్ర బృందం

మల్లన్న గండి రిజర్వాయర్ ను పరిశీలించిన కేంద్ర బృందం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ, తాటికొండ, జీట్టేగూడెం, గండిరామారం గ్రామాల్లో  కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి (జాయింట్ సెక్రెటరీ) మాణిక్ రాజ్ అమృత్ సారోవర్ పథకంలో భాగంగా జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలను శనివారం పరిశీలించారు. గండిరామారం రిజర్వాయర్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.కేంద్ర జల శక్తి అభియాన్ ద్వారా నీటి వనరుల సేకరణ, వాటర్ మేనేజ్మెంట్ సిస్టం, వాటర్ సంబంధిత పంటలు దాని ద్వారా ఉపయోగపడే అంశాలను ప్రజలకు చేరవేయాలని తద్వారా రైతుల వ్యవసాయం కోసం పశువులకు అవసరాలకు భూగర్భ జలాలు అందుతయాని అన్నారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రవేశపెట్టిన పథకాల అమలులో సంతృప్తికరంగా ప్రజలకు సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.రామిరెడ్డి, ఏస్.ఈ సుధీర్, సంబంధిత విభాగాల సిబ్బంది ఉన్నారు.