జిపి కార్మికుల రాస్తారోకో... ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

జిపి కార్మికుల రాస్తారోకో... ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10 లక్షల ప్రమాద బీమా అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలనే డిమాండ్ తో గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం డివిజన్ కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీనితో పాలకుర్తి - స్టేషన్ ఘన్ పూర్ ప్రధాన రహదారిలో గంటపాటు రాకపోకలు స్తంభించాయి. ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు రాస్తారోకోను విరమింప చేశారు. ఈ సందర్భంగా చెట్టు మీది కొంగ.. కెసిఆర్ దొంగ, సొడు సొడు ధనియాలు.. కెసిఆర్ దినాలు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 జిపి కార్మికులను పర్మినెంట్ చేయాలి, ప్రమాద బీమా 10 వేలు చెల్లించాలి, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిపి కార్మిక సంఘం నాయకులు కొడెపాక యాకయ్య, గూడూరు భాస్కర్, జీడి ఆనందం మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు నిత్యం శ్రమించే గ్రామపంచాయతీ కార్మికులు గత 32 రోజులుగా చేస్తున్న సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటిస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరవధిక సమ్మె 33వ రోజు రాస్తారోకోలో జిల్లా గౌరవ అధ్యక్షులు గూడూరు భాస్కర్ గారు సిఐటియు మండల కార్యదర్శి కొడెపాక యాకయ్య గారు గన్ పూర్ చిల్పూర్ జఫర్గడ్ అధ్యక్ష కార్యదర్శులు ఖండాలోజు రాజు జగన్నాథం, జీడి ఆనందం, రతన్ సింగ్, రాజు, క్రాంతి కుమార్, చిరంజీవి కుమార్, వెంకన్న, అనిల్, వెంకటమ్మ, వీరమ్మ, లక్ష్మి, గోరేమియా, హరిలాల్, రేణుక, సుజాత, ఎల్లయ్య, బిక్షపతి, వెంకటమ్మ, సులోచన చిల్పూర్, స్టేషన్ ఘన్ పూర్ మండలాల గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.