కంటి వెలుగును వినియోగించుకోవాలి- జిల్లా కలెక్టర్ శివలింగయ్య

కంటి వెలుగును వినియోగించుకోవాలి- జిల్లా కలెక్టర్ శివలింగయ్య

స్టేషన్ ఘన్ పూర్, కొత్తపల్లి కేంద్రాల సందర్శన:

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య కోరారు. జనగామ జిల్లా కొత్తపల్లి, స్టేషన్ ఘన్ పూర్ కంటి వెలుగు కేంద్రాల సరళిని గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఇంకా తెలియని వారికి వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, గ్రామపంచాయతీ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం అందించి కంటి వెలుగుల వైద్య పరీక్షలు చేయించుకొని వారిని పరీక్షలు చేసుకునే విధంగా చైతన్య పరచాలని ఆదేశించారు. కంటి వెలుగు క్యాంపులలో పరీక్షలు నిర్వహించి వెంట వెంటనే కళ్లద్దాలను పంపిణీ చేయాలని అధిక సైట్ ఉన్న వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని వైద్య పరీక్షలకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

కంటి వెలుగుల క్యాంపులలో అసౌకర్యాల గురించి సంబంధిత సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు, వారికి మేము జారీ చేయవలసిందిగా (ఇన్చార్జి) డిఎంహెచ్వో డాక్టర్ సుధీర్ కుమార్ ను ఆదేశించారు, విధులలో అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ, ఇంటి వెలుగు సిబ్బంది ఉన్నారు.