సైన్స్ పై అవగాహన పెంచాలి

సైన్స్ పై అవగాహన పెంచాలి

ముద్ర ప్రతినిధి, జనగామ: చిన్ననాటి నుంచే పిల్లలకు సైన్స్ పై అవగాహన పెంచాలని స్కాలర్స్ గ్రామర్ హై స్కూల్ డైరెక్టర్లు జగన్మోహన్ రెడ్డి, నీరజ అన్నారు. మంగళవారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా పలు ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు ఎగ్జిబిట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలోని స్కాలర్స్ గ్రామర్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ మంజుల ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు.

 నారాయణ స్కూల్ లో... 
జనగామ నారాయణ స్కూల్ ఈ క్యాంపస్ లో  కూడా నేషనల్ సైన్స్ డేను నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ ఏజీఎం రిజ్వానా, పాఠశాల ఆర్ఐ వేణు, కోఆర్డినేటర్ హారిక, హెచ్ఎం శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ దీప్తి, శ్రీలేఖ, అకాడమిక్ డీన్ విక్రమ్, ఏవో ప్రవీణ్ పాల్గొన్నారు.