ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో, స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఘనంగా జరిగాయి. చిల్పూర్ మండల కేంద్రంలో మీదికొండ ప్రాథమిక ఉన్నత పాఠశాల 1993 - 94 బ్యాచ్ 7వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎస్.కె సర్దార్, గంగుల వెంకటేశ్వర రెడ్డి లను ఘనంగా సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ వేముల వెంకటేశ్వర్లు, వేముల రమేష్, సాంబరాజు, అశోక్,  రాజు, బాలరాజు, వేణు, మంజుల, రజిని, మహేశ్వరి, ఉమా  తదితరులు పాల్గొన్నారు.

ఇప్పగూడ గ్రామంలో 1997-98 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత 50 మంది విద్యార్థులు హాజరై పాతికేళ్ల క్రితం పాఠశాలలో జ్ఞాపకాలను, అనుభూతులను పరస్పరం పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నాటి గురువులైన రాంరెడ్డి, సామల ఎల్లయ్య, దుడుక యాదగిరి, మంగు జయప్రకాశ్ లను శాలు, జ్ఞాపికలతో  సన్మానించారు. కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా దామెర రాజు, ఇనుగాల శిల్ప, కొండం ఉమారాణి, కొల్లూరి సురేష్ వ్యవహరించారు. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి జూలుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి ఇంద్రజాల ప్రదర్శన అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు  ప్రస్తుత పీఈటీ ప్రమోద్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ వారాల రాజు తదితరులు పాల్గొన్నారు.