కాంగ్రెస్ నాయకుని ఇంట్లో పోలీసు అధికారులు సోదాలు

ముద్ర,జఫర్‌గడ్: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలోని శివారు వడ్డెగూడెం గ్రామానికి చెందిన స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య ఇంట్లో స్పెషల్ పార్టీకి చెందిన పోలీస్ అధికారులు బుధవారం తనిఖీ నిర్వహించారు.

ఓటమి భయంతో మా ఇంటి పై దాడి

బిఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కడియం శ్రీహరి ఓటమి భయంతో కక్ష సాధింపుగా కుట్ర పని నా ఇంటిపై పోలీస్ అధికారులచే సోదాలు నిర్వహించారని స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య ఆరోపించారు. స్టేషన్గన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరా గెలుపు కోసం ప్రచార నిర్వహిస్తున్నారని కడియం శ్రీహరి కుట్రలు ఫన్నీ పోలీస్ అధికారులచే దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. పోలీస్ అధికారులు ఇంట్లో ఉన్న మహిళలను అని చూడకుండా మూడు గంటలు పాటు సోదాల పేరుతో హంగామా చేశారన్నారు. నా కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారని నాకు ప్రాణహాని ఉందని నాకు ఎలాంటి ప్రాణహాని జరిగిన కడియం శ్రీహరి దే బాధ్యత అన్నారు.