జీడి ప్రసాద్ కు సన్మానం

జీడి ప్రసాద్ కు సన్మానం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రానికి చెందిన జీడి ప్రసాదును రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర హస్తకళ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ సన్మానించారు. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర గోల్కొండ హ్యాండీ క్యాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో పంచకళా హ్యాండీ క్రాఫ్ట్స్, అండీక్రాఫ్ట్ ఆర్టిసన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న జీడి ప్రసాద్ ని రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్, డా. బుధ ప్రకాష్ జ్యోతి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ హస్తకళా మాజీ మేనేజర్ రజాక్, మసుబ్, శ్రీపని, ఉష తదితరులు పాల్గొన్నారు.