రుణమాఫీ డబ్బు పడేలా చూడాలి

రుణమాఫీ డబ్బు పడేలా చూడాలి
  • జనగామ కలెక్టర్‌ సి.హెచ్‌ శివలింగయ్య 
  • వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులకు సూచన

ముద్ర ప్రతినిధి, జనగామ : రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బు పడేలా వ్యవసాయ, బ్యాంకు అధికారులు చూడాలని జనగామ కలెక్టర్‌ సిహెచ్‌.శివలింగయ్య సూచించారు. గురువారం జనగామ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ సంబంధిత అధికారులతో   జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  కొద్ది మంది రైతులకు అకౌంట్లో డబ్బులు పడట్లేదని ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వారి సందేహాలను రైతులు ఆయా క్లస్టర్‌ ఏఈవోల వద్దకు వెళ్లి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

 రైతులు రుణం తీసుకున్న బ్యాంకులో రైతులకు అకౌంట్‌ నంబర్‌ ఉండి ఉంటే, ఆ అకౌంట్లో డబ్బులు జమచేయనున్నట్లు తెలిపారు. అకౌంట్‌ క్లోజ్‌ అయినా, మారిపోయినా, ప్రభుత్వమే ఆ రైతులకు ఉన్న ఇతర అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు జమచేస్తుందని, ఒకవేళ రుణ మాఫీ అయిన రైతు చనిపోతే, వారి అసలైన వారసులు బ్యాంక్‌ మేనేజర్‌ను కలిసి సంబంధిత పత్రాలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్‌ కుమార్‌, బ్యాంక్‌ అధికారులు,  ఎల్‌డిఎం శ్రీధర్‌ పాల్గొన్నారు.