కోదాడ నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

కోదాడ నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

ముద్ర ప్రతినిధి ,కోదాడ:-గురువారం జరగనున్న అసెంబ్లీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఎన్నికల రిటర్నిoగ్ అధికారి సూర్యనారాయణ తెలిపారు . నియోజకవర్గ వ్యాప్తంగా రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై నాలుగు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు . ఇందు కోసం మొత్తం 296 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఒక ఈవీఎం చొప్పున 296 ఈవీఎం లు ఏర్పాటు చెయ్యగా , మరో 74 ఈవీఎం లు అదనంగా అందుబాటులో ఉంచారని తెలిపారు . ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి నలుగురు సిబ్బంది చొప్పున 1184 మంది సిబ్బందితో పాటు అదనంగా మరో 200 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 25 రూట్లు ఏర్పాటు చెయ్యగా 25 మంది సెక్టార్ ఆఫీసర్లతో పాటు అదనంగా మరో ముగ్గురు సెక్టార్ ఆఫీసర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు .

నియోజకవర్గంలో 85 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. బుధవారం ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి దిశా నిర్ధేశం చేశారు . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సామాగ్రికి పూర్తీ భద్రత కల్పించటమే లక్ష్యంగా పని చెయ్యాలని సిబ్బందికి సూచించారు . నియోజకవర్గంలో మొత్తం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై అదనపు బలగాలతో  ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు . నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది వందల ఎనభై మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . గురువారం ఉదయం ఐదున్నర గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన  అనంతరం రెగ్యులర్ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం ఐదు గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు.