భట్టి పాదయాత్ర వాయిదా

భట్టి పాదయాత్ర వాయిదా
  • రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:-సూర్యాపేట నియోజకవర్గంలో 21 వ తేదీ నుండి ప్రారంభం కాబోయే మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ను వాయిదా వేయడం జరిగిందని, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర రావు తెలిపారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో భట్టి పాదయాత్ర  కొనసాగుతున్న సందర్భంలో, తీవ్ర ఎండ వేడిమి, వడగాలుల వలన భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురికావడం వలన పాదయాత్ర ను వాయిదా వేశామని చెప్పారు. తదుపరి పాదయాత్ర తేదీలపై మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, భట్టి విక్రమార్కలు కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని, తదనుగుణంగా త్వరలోనే సూర్యాపేట నియోజకవర్గం లో భట్టి పాదయాత్ర నిర్వహణ తేదీలు ప్రకటిస్తామని చకిలం రాజేశ్వర రావు అన్నారు.మాజీ మంత్రి వర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్వయంగా భట్టి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారని, మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట నుండి డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్య బృందాన్ని కేతేపల్లి లో భట్టి పాదయాత్ర బృందం బస చేసిన గుడారాల దగ్గర తీసుకుని వెళ్ళి మెరుగైన చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం భట్టి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు ప్రస్తుతం చికిత్సతో పాటు పూర్తి విశ్రాంతి అవసరం అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యుల బృందం తెలియజేసిందని చకిలం అన్నారు. భట్టి ఆరోగ్యం కుదుట పడేవరకు నిరంతరం వైద్య సేవలు అందే విధంగా మాజీ మంత్రి వర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్ని చర్యలు చేపట్టినట్లు,  ఎప్పటికప్పుడు భట్టి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ, సమన్వయం చేస్తున్నట్లు చకిలం రాజేశ్వర రావు  తెలియజేశారు‌. నియోజకవర్గం లోని  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించి, తదుపరి నిర్వహించబోయే  పాదయాత్రకు సర్వ సంసిద్దులై ఉండాలని చకిలం రాజేశ్వర రావు చకిలం అన్నారు.