బీపీ మండల్ ఆశయ సాధనకు కృషి - డాక్టర్ రామ్మూర్తి యాదవ్

బీపీ మండల్ ఆశయ సాధనకు కృషి - డాక్టర్ రామ్మూర్తి యాదవ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: బిపి మండల్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని శ్రీకృష్ణ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ డాక్టర్ రామ్మూర్తి యాదవ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీపీ మండల్ 105వ జయంతిని జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ బీసీల కోసం మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో బీపీ మండల్ ప్రత్యేకంగా పోరాటం చేశారన్నారు. మండల్ పోరాటం వలన బీసీలకు రిజర్వేషన్ దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఐక్యత సక్రమంగా లేకపోవడం వల్లనే వివిధ పార్టీల నాయకులు టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతుందని దుయ్యబట్టారు .

బీసీలకు రావాల్సిన వాటాలను వచ్చే వరకు పోరాటం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బీసీ నాయకులు ఒక తాటి పైకి రాకపోతే బిసి రిజర్వేషన్లను సక్రమంగా అమలు కావన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు నాయకులు పోలబోయిన నర్సయ్య యాదవ్, మాండ్ర మల్లయ్య యాదవ్, తోట శ్రీనివాస్ యాదవ్, వెలగబోయిన మధు యాదవ్ ,సుంకరబోయిన వెంకన్న యాదవ్ ,వీరబోయిన లింగయ్య యాదవ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు శ్రీరాములు మాదిగ ,గిరిజన నాయకుడు లచ్చిరాం నాయక్ ఎడ్ల వెంకన్న యాదవ్ మట్ట యాదవ్, బిక్షపతి యాదవ్ ,సుంకరబోయిన రాజు యాదవ్ తదితరులు ఉన్నారు.