డ్రగ్స్ వినియోగంతో యువ శక్తి నిర్వీర్యం

డ్రగ్స్ వినియోగంతో యువ శక్తి నిర్వీర్యం

డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకం: ఎస్పీరాజేంద్ర ప్రసాద్  
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకమని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్ రాజేంద్రప్రసాద్ అన్నారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా  అంతర్జాతీయ వ్యతిరేఖ దినోత్సవం జూన్ 26 పురష్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో గల శ్రీవేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ S.రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై డ్రగ్స్ దుర్వినియోగం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్పీ  మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకం, డ్రగ్స్, గంజాయి, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, డ్రగ్స్ అనేది దేశ శక్తిని, యువతను నిర్వీర్యం చేస్తుంది అని ఎస్పీ  అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన నిఘా ఉంచి జిల్లా వ్యాప్తంగా అక్రమంగా నిల్వ ఉన్న, రవాణా చేస్తున్న భారీగా గంజాయి సీజ్ చేశాం అన్నారు.

ఈ డ్రగ్స్ అనేది సమాజాన్ని నాశనం చేస్తుందని, ఇది సమాజ మనుగడకు, యువత జీవితానికి వినాషణకారి ఆని, డ్రగ్స్ ను సమాజం నుండి పారద్రోలడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.డ్రగ్స్ వినియోగానికి, రవానాకి దూరంగా ఉండాలనీ, దీనికి సంభందించి పోలీసు వారికి సమాచారం అందించాలి అని ఎస్పీ  అన్నారు. దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఆధారపడి ఈ దేశంలో లో డ్రగ్స్ బారినపడి యువత వారి బంగారు భవిష్యత్తును తమ చేతులారా తామే నాశనం చేసుకుంటుందన్నారు. ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎక్కడో ఒక చోట వాటి పేర్లు వినపడిందని దీనిపై జిల్లా పోలీసులు నిరంతరం నిఘా పెట్టింది అన్నారు. యువత డ్రగ్స్ వ్యతిరేక నినాదంతో ముందుకు వచ్చి మన దేశ భవిష్యత్తును మార్చే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. 

డ్రగ్స్ కు అలవాటు పడ్డ వారిలో గుర్తించే ప్రారంభ లక్షణాలు 
ఎలాంటి కారణం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో మార్పు వస్తుందని,
అభిరుచులు లేదా ఇతర కార్యక్రమాలలో ఆసక్తి చూపకపోవడం,
ప్రతిభ తగ్గిపోవడం. రహస్యంగా, ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించడం.
ఆహారం పట్ల నిర్లక్షం, ఆకలి లేకపోవడం. 
కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు.
కోపం, చిరాకు, భయం, నీరసం తదితర లక్షణాల ద్వారా గుర్తించవచ్చని ఎస్పీ చెప్పారు
ఈ కార్యక్రమంలో DSP నాగభూషణం, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.